Logo
Date of Publish : 09 January 2023, 4:54 pm
Editor : Sake Naresh

ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్న వైసీపీ : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

        నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 238వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆటో స్టాండ్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం అధికారం ఒక్కరికే ఉండదని, ప్రజాసంక్షేమం, సమాజాభివృద్ధిని బట్టి ప్రజలు అధికారంలో ఉండే పార్టీలకు మరలా అధికారం అందిస్తారని కానీ నేడు రాష్ట్రంలో వైసీపీ ఈ విషయాన్ని మరచి నియంతృత్వ ధోరణిలో వెళ్తూ ప్రజలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తోందని అన్నారు. నిరంకుశ పాలనకు సూచికగా జీవో 1 లాంటివి తీసుకురావడం, ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి పోలీసులచే బ్యూరోక్రాట్ పాలన సాగించడం, ప్రతి 50 ఇళ్ళకు వాలంటర్ల పేరుతో ప్రజల మీద నిఘా పెట్టి ప్రభుత్వ తీరుపై వ్యతిరేకంగా ఉన్నవారిని వేధింపులకు గురిచేయడం పలు ఉదాహరణలు అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఈ విధమైన తీరుతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని, ప్రజల స్వేచ్ఛను వైసీపీ కాలరాస్తోందని అన్నారు. పవనన్న ప్రజాబాటలో ఏ ఇంటికి వెళ్తున్నా ఈ ప్రభుత్వ దూరగతాలను, అణచివేత ధోరణి గురించి ప్రజలే తమకు వివరిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమని తెలిపారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com