విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్ తన పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కపర్థి సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రదర్శన సమయంలో గొడవ విషయమై పోతిన మహేష్ స్పందిస్తూ నిన్న రాత్రి కపర్థి థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రదర్శన సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముసుగులో వైసీపీ గుండాలు సీట్లు చించేసి, స్క్రీన్ కోసి అలజడి సృష్టించి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ను డామేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది వైసీపీ నాయకులు వైసిపి గుండాలు థియేటర్లోఅలజడి సృష్టించారని, దీనిపై నగర పోలీస్ కమిషనర్ గారు విచారణ జరిపించి, బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు కొరగంజి రమణ అమీర్ భాష జనసేన నాయకులు తమ్మిన రఘు సావిన్కర్ నరేష్, పులి చేరి రమేష్, మర్జి, సుఖాసి భాను, పైల పవన్, శ్రీనివాస్, బైపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com