Search
Close this search box.
Search
Close this search box.

వైసిపి మహిళా నోటి పొగరు మంత్రి రోజా… నోరు అదుపులో పెట్టుకో : గునుకుల కిషోర్

రోజా

        నెల్లూరు ( జనస్వరం ) : వైసీపీ మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున గునుకుల కిషోర్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి బుద్దేల మారు వినురా సుమితి..వేమన అన్నట్టుగా హోదాకి మంత్రి అయినా నోరు మాత్రం కంపు… రాష్ట్రస్థాయి లో మహిళా మంత్రి గా పదవిలో ఉన్న ఈమే నోటి నుంచి అలగా జనం,సంకరజాతి అనే మాటలు అనే మాటలు రావడం సిగ్గుచేటన్నారు. మార్చి మార్చి జెండాలు మోయడం గురించి నీవే చెప్పాలి ఎంత ప్యాకేజీ తీసుకొని తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చావో వివరించాలి. జగన్ తండ్రిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడినప్పుడు ఎంత ప్యాకేజీ ముట్టింది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినప్పుడు బాబుని తిట్టేనప్పుడు ఎంత ప్యాకేజీ ముట్టింది. మీ నియోజకవర్గంలో ప్రజలంతా పట్టిన పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నీ ఐరన్ లెగ్గు మహిమ వైఎస్సార్సీపి పూర్తిగా పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ హోదాలో నోటి నుంచి బూతులు తిడుతూ సభ్యసమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారు.  మీ నాయకుని నమ్ముకున్నందుకు రానున్న రోజుల్లో మీరు అనుభవించాల్సిన శిక్షలు చాలానే ఉన్నాయి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వారిని అనుసరిస్తున్న జన సైనికులను విమర్శించే స్థాయిని మీకు లేదు. బీరు బిర్యాని కి వచ్చే విలువలు లేని మనుషులు కాదు మా జనసైనికులు సమాజంలో మార్పు కోసం సైనికులుగా ముందుకు వస్తున్న మా జన సైనికులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం. నీకో ధర్మం పక్కోడికి ఒక ధర్మమా నిన్ను అంటే ఎంత బాధ పడుతున్నావు పక్కవాళ్లు కూడా అంతే నీకు తెలుసుకుంటే మంచిది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే ఎవరో ఒకరు రాలగొట్టి చేతిలో పెడతారు. ఎవరో సోషల్ మీడియాలో ఏదో పెట్టారని ఏడ్చే నీకు నీకు సాటి మనిషి బాధ అర్థం కాని అహంకారివి. సొంత ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం పట్ల అసహనంగా ఉన్న పరిస్థితుల్లో మీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ ఆలోచించి ఈ నోటి మంత్రులకు అందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమ సమాజం స్థాపించాలంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా తెలిపారు. కోతి చేష్టలు.. మన యూట్యూబ్ లో ఫేమస్ అయిన ఒక వీడియో చూసినట్లయితే పులికి దొరక్కుండా ఒక కోతి విసిగిస్తూ సంబరపడుతుంది దాన్ని చూసి కోతిది గొప్పది అనుకున్న వాళ్లు తెలివి తక్కువ వారు అని అనుకోవచ్చు. వై సి పి వారి పరిస్థితి కూడా అలానే ఉంది.చిల్లర మాటలు మాట్లాడి మా వారివి అల్లరి చేస్తున్నారని లో అర్థం లేదు. గతంలో వైజాగ్ లో మిడిల్ ఫింగర్ కూడా చూపించారు దానికి అర్థం ఏంటో కూడా తెలుపగలరు. మేమేమీ ఎస్సీ, ఎస్టీలం కాదు అనే అహంభంతో మాట్లాడారు ఇప్పుడేం ఎలక్షన్లు కాదు ప్రజలందరిని కలవాల్సిన అవసరం లేదు అని కూడా అన్నారు. మీడియాలో ప్రచారం అయింది. మీ వికృతి చేష్టలు ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని మరిచి ప్రతిపక్షాల మీద విర్రవవగుతున్న మీకు సరైన సమాధానం చెబుతారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు నగర కార్యదర్శి కృష్ణవేణి,ఉమాదేవి వీర మహిళ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way