నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు . గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ గడచిన రెండు సంవత్సరాల్లో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేదలు, సామాన్యుల వాహనంగా పేరొందిన ఆర్టీసీ లో ప్రయాణం ప్రయాణికులకు భారంగా మారిందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తో చర్చించి పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా ఉన్న బస్సు ఛార్జిలను తగ్గించాలని, జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులకు పెంచిన బస్సు ఛార్జిలను తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందచేసారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పారిచర్ల భాస్కర్, ఇంద్రవర్ధన్, శివ, కుమార్, సాయి, సంతోష్, మని, మోహన్, ఇమ్రాన్, సనత్, భార్గవ్, శరత్, విష్ణు, మస్తాన్ , కార్తీక్, పెంచలయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.