– బికేపల్లిని మురుగు నీటిలో ముంచేసిన వైసీపీ నాయకులకు గాంధీ జయంతి చేసే అర్హత ఎక్కడ ఉంది
– అధ్వాన్నంగా రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటులో వైఫల్యం, నీటి కోసం నానాపాట్లు
– మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన
– మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం
మదనపల్లి ( జనస్వరం ) :మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బి.కె.పల్లి కాలనీలలో సౌకర్యాల కల్పనలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న పట్టించుకోకుండా వున్నారని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త, స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. మదనపల్లె టౌన్ బి.కె.పల్లిలో ఇంటికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, మురికి నీటి కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ఎదుట జనసేన పార్టీ ఆద్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ప్రమీల కు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ బి.కె. పల్లిలో మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలని, వీధులలో సిమెంటు రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పలుమార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కారానికి మాత్రం చోరవ చూపడం లేదని ఆరోపించారు. బి.కె. పల్లిలో పాలకుల వైఫల్యం కన్నులకు కట్టినట్లు కనిపిస్తోంది, కానీ పరిష్కారం చూపడం లేదని గాంధీజీ మీరైనా ఈ పాలకులకు కనువిప్పు కలిగించాలని కోరారు.ఈనెల 15 తేదీ లోపు బీజేపల్లిలో రోడ్లు కాలువలు పనులు ప్రారంభించక పోతే 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి బికేపల్లిలోని సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శంకర్, రాయల్ సునీత, శ్రీనాథ్, బి కే పల్లి నాయకులు, ఆఫీసర్ సెమి నాగేంద్ర, దేవేంద్ర, మరియు బికేపల్లి ప్రజలు పాల్గొన్నారు.