Logo
Date of Publish : 18 November 2020, 8:09 am
Editor : Sake Naresh

వైస్సార్సీపీ, టీడీపీ, మైనార్టీ ద్రోహులు : జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యురాలు, పాలవలస యశస్వి గారు

వైస్సార్సీపీ, టీడీపీ, మైనార్టీ ద్రోహులు : జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వి గారు

                కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం మరియు కుటుంబ సభ్యుల ఆత్మహత్య సంఘటన పై విజయనగరం జనసేన ఇంచార్జ్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి గారు మరియు జనసేన మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్ జనసేన పార్టీ తరపున స్పందించారు. ఈ సంఘటన పై మంగళవారం ఉదయం విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరులతో యశస్విగారు మాట్లాడుతూ అబ్దుల్ సలాం మరియు కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయని, ఇప్పుడు చనిపోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయని, ఈ రెండు ప్రభుత్వాలు మైనార్టీ ద్రోహులే అని ధ్వజమెత్తారు. వీరికి ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

               జనసేన మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ అబ్దుల్ సలాం మరియు కుటుంబ సభ్యుల ఆత్మహత్య సంఘటన చాలా బాధాకరం అని దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి ఆ కేసును సీబిఐ వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని యేడల జనసేన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశం లో జిల్లా చిరంజీవి యువత అథ్యక్షుడు, జనసేన సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు), మరియు జనసేన కార్పొరేట్ అభ్యర్థులు ఎంటి.రాజేష్ , దాసరి యోగేష్, లోపింటి కళ్యాణ్, జనసైనికులు హబీబ్,భవాని,రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com