Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ – ఇసుకతో దొంగాట

వైసీపీ

కాదేది కవితకి అనార్హం – శ్రీ శ్రీ
కాదేది ధ్వంసానికి అనర్హం, ఇది విధ్వంసం – బుద్ధి వచ్చిన సగటు ఆంధ్రుడు.

      గొంతుని తడిపే నీరు ఏరులా పారుతుంటే, అప్పుడే పుట్టిన పసి బిడ్డలా మెత్తని ముద్దులాడే ఇసుక తేలాడుతుంటుంది. ఎండ తగలగానే బోసి నవ్వులు నవ్వుతూ బంగారు తల్లిలా మెరుస్తూ ఎంతో మంది ఇళ్ల కళని నెరవేరుస్తుంది ఆ ఇసుక. ఎంతో మందికి జీవనోపాధి కలిపించి, ఆ ఇంటిల్ల పాది ఆకలి తీరుస్తుంది అదే ఇసుక. అలాంటి ఇసుకతో ఆటలా? ఆ ఇసుకని అడ్డం పెట్టుకొని చేయకూడని నేరాలు అన్ని చేస్తారా?

       గత టీడీపీ ప్రభుత్వంలో హనుమంతుడు లంకని మొత్తం తగలబెట్టి, సీత దేవి ఉంటున్న అశోక వనాన్ని మాత్రం వదిలేసినట్టు… అధికార మదంతో అడ్డు అదుపు లేకుండా దోచేయాల్సిందంతా దోచేసుకున్నారు టీడీపీ పార్టీ నేతలు. NGT- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా రాష్ట్రంలో జరిగిన అక్రమాలు గుర్తించి 100 కోట్ల జరిమానా కూడా విధించింది. ఇప్పటికైనా అర్ధం అయ్యుంటుంది టీడీపీ చేసిన అక్రమ ఇసుక మీద దోచిన సంపాదన. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అయితే, మాయలోకంలో మాయ చేసినట్టు… తీస్కుంటున్న నిర్ణయాలు నవ్విస్తుంటే, ఆ నిర్ణయాల వల్ల జరిగిన నష్టం శోక సంద్రంలో ముంచేస్తుంది. గద్దె ఎక్కడం లేటు ఇసుక తరలింపు ఆపేసింది ప్రభుత్వం. అసలే అమరావతిని అయోమయంలో పడేసి కూలీల జీవితాలని చిన్నాభిన్నం చేసేస్తే, ఇపుడెలారా భగవంతుడా అని ఆలోచించే సమయం ఇవ్వకుండానే మరింత క్షోభకి గురిచేసింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులకి ఎన్ని దారులు ఉన్నా, పనిచేయడానికి ముడి సరుకు లేకపోతే ఎలా! ఇసుక లేక పనులు లేవు. కానీ ఇళ్ళు గడవాలి. పొట్టలో పేగులు అరిచే ఆర్తనాదాలు కన్నా సొంత ఇంటి మనుషుల పస్తుల కన్నీళ్లే ఇంకా బాధపెడ్తుంది. ఏ కూలి వాడి ఇంట్లో చూసినా ఆకలి కేకలే. ఏ గడప తొక్కిన చావు కన్నీల్లే దర్శనమిచ్చాయి. ఈ ఆకలి కేకలు చావుల అవతారం ఎత్తింది. ఆంధ్ర రాష్ట్రంలో కాటికాపరులకి వాళ్ళ పని ఒత్తిడి పెంచింది ఈ ఇసుక కొరత. ఈ ఇబ్బందులు ఎన్నాళ్లు భరించాలో తెలియక, వలస బాట పట్టారు కూలీలు. తెలియని ఊరులో ఉంటూ, సొంత బాష మాట్లాడలేని ప్రజల మధ్యలో, ఆలు గడ్డల 4 మెతుకుల కోసం వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. వలస పోయాక ఇల్లు వాకిలి ఉండదు, నచ్చిన మన ఊరి నలుగురు మనుషులు ఉండరు. చీకటి పడ్డాక అరుగు మీద కబుర్లు అసలే ఉండవు. ఎలా ఉన్నావు రా? అని పలకరించే నాధుడే కరువైయ్యాడు. ఎంత పేద కార్మికుడైనా వాడి ఊరికి మాత్రం రారాజే. కానీ వలస వెళితే మాత్రం పశువు కన్నా హీనంగా బతకతప్పలేదు. ఇంత ఘోర దుస్థితి తీస్కోచింది ఈ ప్రభుత్వ నిర్ణయం. ఎన్ని నెలలు గడుస్తున్నా ఈ తిప్పలు తప్పలేదు. ఇసుక కొరతకు అంతం లేకుండాపోయింది. కార్మికులు రోడ్లపైకి వచ్చి ఎన్ని కేకలు వేస్తున్నా, ఏసి లో ఉండే నాయకుడికి ఎం వినపడ్తుందిలే. కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధులకి. వీళ్ళు మనల్ని ఉద్దరించేవారు. మన కర్మ.
           కానీ ఈ కేకలు, ఆర్తనాదాలు వినాల్సిన వాళ్ళకి బాగా వినపడ్డాయి. రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తే పనులు అవుతాయో వాళ్ళకే నేరుగా విన్పడింది. బాధని మింగుకొని, గుండెని రాయ చేసుకొని, జరుగుతున్న శ్రామిక కష్ట దహనాన్ని బరువెక్కిన గుండెతో మొత్తాన్ని చూస్తున్నాడు పేదల నాయకుడు జనసేనాని. బూతల్లికి ఉన్న సహనం మరియు ఓపిక జనసేనానిది. ఈ గోరాలని తాళలేక సహనం ఓపిక రెండు నశించాయి. ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు అన్నిటినీ తన దేహానికి పడిన కష్టాలుగా భావించి, ప్రభుత్వ నాయకులకి పీఠాలు కృంగదీయడానికి సిద్దమయ్యాడు జనసేనాని. Nov 3, 2019న సాగర తీరాన విశాఖలో లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. అందరూ అంకునట్టే ఆయన అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా వస్తారని భావించారు. కానీ అందుకు బిన్నంగా, ఎవ్వరు ఊహించని విధంగా… భవన నిర్మాణ కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చారు. ఇతర పార్టీ సభలకి జన సమీకరణ కోసం మద్యం, డబ్బు పంచుతారు. కానీ ఈసారి దానికి భిన్నంగా, బాధ, ఆవేదన, కోపాలని గుండెలో నింపుకొని ఒక ఉప్పెనలా కదిలొచ్చారు భవన నిర్మాణ కార్మికులు. కనుచూపు మేర ఎటు చూసినా జన సంద్రోహమే. బహుశా దేనినే ఆవేదన సంద్రోహమ్ అంటారేమో. చితికిపోయిన జీవితాలకి అండగా ప్రజానాయకుడు జనసేనాని ఒక వైపు, ఓట్లు వేసి గెలిపించిన శత్రువు మరో వైపు. ఈ మధ్యలో జనసేనాని ధృడనిశ్చయంగా ఇస్తున్న భరోసా భవన నిర్మాణ కార్మికుల ఆశాజ్యోతిగా నిలిచింది. నిప్పుల కొలిమిలో ఆహుతి అవుతున్న జీవితాలకి, జనసేనాని భరోసా ఆ జీవితాలకి హాయినిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొస్తుందని అనుకుంటే పొరపాటే. ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన ఇసుకని ఆపేసి, కృత్రిమ కొరత సృష్టించి, ప్రజలకి ఇసుకని దూరం చేశారు. కృత్రిమ కొరత వలన చాలా మంది క్వారీలో పిక్క నుండి దొరికే ఎం సాండ్/ రోబస్ట్ సాండ్ని వాడడం మొదలు పెట్టారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి బాగా నేర్పరి తనం ఉన్న పని ప్రతీ దాంట్లో కమిషన్లు దోచేయడం. ఇప్పుడు క్వారీ వాళ్ళతో బేరాలు ఆడేసుకొని, టిడీపీ హయాంలో ఎక్కడా తీసిపోని విధంగా దొరికినంత దోచేశారు ప్రస్తుత అధికార పార్టీ నేతలు.  ఎం మిగిల్చింది ఈ ఇసుక కొరత? కార్మికుల ఇళ్లల్లో చావులు, మట్టిలో కలిసిన భౌతిక దేహాలు, స్వర్గానికి చేరిన ఆత్మలు, రొచ్చు రాజకీయ నాయకుల కూర్చుకున్న ఆస్తులు తప్ప? సిగ్గుకి ఉండాల్సిన కాస్త మొలతాడుని కూడా విప్పేసారు. 

          అధికార పార్టీ వారు ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలని “ఇసుక వారోత్సవాలు” అని మొదలుపెట్టారు. కృత్రిమ కొరత సృష్టించింది వీళ్ళే, ప్రజలకి ఇసుకని దూరం చేసింది వీళ్ళే, ఇప్పుడు కూడా “ఇసుక వారోత్సవాలు” పేరుతో వీళ్ళే ఏదో ప్రజలకి అందిస్తున్నట్టు సువర్ణ గీతాలు ఆలపిస్తునారు. ఆ ఇసుక కోసం యార్డులు, రీచ్లు, ఆన్లైన్ చలానా అంటూ ప్రజలని గందరగోళంలో పడేసి, ప్రజల శక్తిని, సమయాన్ని ఫ్రూటీ జ్యూస్లో స్ట్రా పెట్టి పీల్చినట్టు పీల్చేసింది ఈ ప్రభుత్వం.ప్రభుత్వ నిర్ణయాలు తప్పుల మీద తప్పులు చేస్తూ,ఆ తప్పుని కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తూ, వైసీపీకి ఓట్ వేసి తప్పు చేశామన్న స్థితికి ప్రజలని దిగజార్చింది అధికార ప్రభుత్వం. నెలలో రోజులు 1 నుండి 30 వరకు పరుగులు పెడ్తున్నాయి, సంవత్సరంలో ఋతువులు నేను ముందంటే నేను ముందు అంటూ పోటీ పడుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. జనసేనాని దయతో కొంతయినా ఉపశమనం దొరికింది.
         ఎం చేసాడు జనసేనాని? ఒక్క లాంగ్ మార్చ్ తో… 
– కార్మికుల ఆకలి కేకలకి ముగింపు పలికాడు
– చావు ఒక్కటే మార్గం అని కృంగిపోయిన కార్మికులకి ఒక బంగారు బాట వేసి చూపించాడు
– వ్యాపారాలు కోల్పోయిన వ్యాపారస్తులకి తిరిగి గుండెల నిండా భరోసా నింపాడు
– పుస్తెలు తాకట్టు పెట్టి జీవనం సాగిస్తున్న అక్క చెల్లమ్మలకి తిరిగి చిరునవ్వులు పంచాడు
– పనులు లేక, ఇళ్ళు గడవక, స్కూల్ కి దూరమైన పిల్లలకు మళ్ళీ స్కూల్ బ్యాగ్ తగిలించాడు
– వలసలుపోయిన తోటి ఆంధ్రులకి, తిరుగు ప్రయాణానికి చేయి అందించాడు
ఇలా ఇంకెన్నో… చూడనవి ఇంకెన్నో… వినలేనివి మరెన్నో.

         బుద్ధి తెచ్చుకున్న ప్రజలు ఈసారైనా సమాజంలో జరిగిన అన్యాయాలకు వెన్నుముక్కలా నిలబడిన జనసేనానికి అండగా నిలుస్తారో? లేదా మందు డబ్బుకి అమ్ముడుపోయి మళ్ళీ ఆ కష్టాన్ని మరో 5 ఏండ్లు మోస్తారో వేచి చూడాలి. 

#Written By 

ట్విట్టర్ ఐడి : @TeamV_2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
IMG-20240416-WA0003
శిరోమ మండలనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి జైలు శిక్ష
IMG-20240413-WA0017
నిస్వార్థ ప్రజా సేవకులు వైసీపీలో ఉండలేరు : కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240407-WA0061
అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా సిద్ధమైన పార్టీ వైసీపీ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way