● 8నెలల్లో బంగ్లా కట్టుకున్న పుష్ప శ్రీవాణి మూడేళ్లయినా తోటపల్లిలో పడదోసిన దేవాలయం పూర్తి చేయుంచలేదు
● గ్రామాల్లో నిర్మించే రామాలయాల కంటే తక్కువ చేసి కడుతున్నారు
● ఆలయంలో వసతులు లేక తగ్గిన భక్తుల రద్దీ
● విధులకు డుమ్మాకొడుతున్న ఈఓ
● మహిమగల వెంకన్నకు పంగనామాలు పెడుతున్నారు
విజయనగరం, (జనస్వరం) : చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి వెంకటేశ్వర స్వామి డేవాలయంపై పాలకులు, అధికారులు సీతకన్ను వేశారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పాలూరి బాబు అన్నారు. ఆదివారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లిలో స్వయంభూగా వెలసిన మహిమగల వెంకన్నకు వైసీపీ పాలకులు, దేవాదాయశాఖ అధికారులు పంగనామాలు పెడుతున్నారన్నారు. వాస్తు పేరుతో పూర్వికులు అద్భుతంగా నిర్మించిన వేంకటేశ్వరుని దేవాలయాన్ని పడదోసి 2018లో రూ.83 లక్షల వ్యయంతో ఆలయనిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. అదే కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాత్రం పెద్ద బంగ్లాను 6 నుండి 8 నెలల కాలంలో కట్టేసుకున్నారు. అదే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ను 6 నెలల్లో కట్టేసుకున్నారు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం, స్వయంగా వెలసిన ప్రఖ్యాత గాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం మూడేళ్లు ఐనా నిర్మాణం పూర్తి చేయలేదు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాలు రాజమండ్రి, కాకినాడ, ఒడిశా తదితర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేవారు. వసతులు లేక ఇప్పుడు భక్తులు రావడం లేదు. మరుగుదొడ్లు, వసతి, స్నానపు గదులు తదితర సౌకర్యాలు లేక భక్తుల రద్దీ తగ్గింది. దేవుడు ఉండాల్సిన చోట ఉంచలేదు. అసలు దేవాలయ నిర్మాణం కూడా గ్రామాల్లో కట్టుకునే చిన్నపాటి రామాలయంలాగ కడుతున్నారు. ప్రసిద్ధగాంచిన దేవాలయ నిర్మాణం అలానే చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తాత్సారం వలన చిన్నతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. తోటపల్లి దేవాదాయాన్ని దేవాదాయశాఖ నుండి తప్పించి టీటీడీకి అప్పగించాలి. నాయుబ్రాహ్మణలకు జీతాలు పెంచి సకాలంలో జీతాలివ్వాలి. అలాగే భక్తులు రద్దీ తగ్గడంతో దేవుణ్ణి నమ్ముకొని ఉన్న చిరువ్యాపారులు తదితరులు భక్తులు రాకపోవడంతో జీవనం కష్టమవుతోందని వాపోతున్నారు. కాబట్టి వారిని ఆదుకోవాలి. ఈఓ ఆలయానికి రావటం లేదని, భక్తులు ఇచ్చిన విరాళాలు, దేవాలయ ఆదాయంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వాటిపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com