
విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం 31వ వార్డులో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడంపై జీవీఎంసీ 38వవార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి బీశెట్టి ‘వసంతలక్ష్మి గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం డాబాగార్దెన్స్ వీజేయఫ్ ప్రెన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నమ్మక ద్రోహానికి పాల్పడుతూ 31వవార్డులో అక్రమ పద్దతిలో అభ్యర్థిని నిలబెట్టిందని, వైసీపీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బిపిన్ కుమార్ జైన్ ఉన్నట్టు ఆర్వో ప్రకటించారని, దీనికి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటీసు బోర్డులో ఆర్వో ఫారం 06ను అతికించారన్నారు. మళ్ళీ గంటల వ్యవధిలోనే స్వతంత్ర అభ్యర్థి బిపిన్ కుమార్ జైన్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి అతనికి ఫ్యాన్ గుర్తు కేటాయించటం దారుణమని మండిపడ్డారు. దీనితో వైసీపీ నిజస్వరూపం తేలిందని పేర్కొన్నారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ కు పిర్యాదు చేస్తామన్నారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న జరిగే ఉప ఎన్నికలో జనసేనపార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెరకం పార్వతిని 31వ వార్డు కార్పొరేటర్ గా గెలిపించవలసినదిగా కోరారు. ఈ మీడీయా సమావేశంలో 31వవార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెరకం పార్వతి, పార్టీ దక్షణ నియెజవర్గం ముఖ్య నాయకులు గోపికృష్ణ, మూగి శ్రీనివాసరావు, శివప్రసాద్, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.