•కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోక తప్పదు..
•జగన్ రెడ్డి మాట్లాడితే నా అక్కా నా చెల్లెమ్మలు అని అంటారు అయితే మీరు జెసిబిలు పెట్టి కూల్చుతున్న ప్రతిచోట అక్కాచెల్లెమ్మల గోడు వినపడలేదా..
•కేంద్రం డబ్బుతో కట్టిన టిట్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటికి వైసీపీ రంగులు వేయడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు అందులో భాగంగా వైసిపి అవినీతిని బయట పెట్టేందుకు ఈనెల 12,13,14 తేదీలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోషల్ ఆడిట్ చేయబోతున్నాం..
•ప్రజలను దోచుకు తింటూ వారిని రోడ్డున పడేస్తున్న వైసిపి ప్రభుత్వం..
•రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత.
అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు నిలువరించలేని పోలీసు వ్యవస్థ వైసీపీ అవినీతి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఉన్నదని అన్నారు. ప్రజల పక్షాన అండగా నిలబడడానికి ఇప్పటం గ్రామానికి వచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అడుగడుగునా అడ్డుకోవడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు వేయలేని వారు గుంతలు పూడ్చలేని వాళ్లు రహదారులు విస్తరణ పేరుతో కనీసం బస్సు సౌకర్యం లేని ఇప్పటం గ్రామానికి రోడ్ల విస్తరణ పేరుతో 55 ఇళ్లులను కూల్చివేయడం వైసిపి ప్రభుత్వం కక్షపూరిత చర్య. అదేవిధంగా ప్రధాన రహదారి నుంచి ఇప్పటం గ్రామానికి వెల్లేదారి 30 అడుగులే ఉంటే అది విస్తరించలేని ఈ ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో 60 నుంచి 70 అడుగులు ఉన్న రహదారి విస్తరించడానికి ప్రజల ఇల్లు కూల్చిందంటే ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యనే అని అన్నారు. ప్రజలు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోవడానికి స్థలం ఇచ్చారన్న నెపంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామం పై కక్ష పెంచుకుని వారి ఇల్లులను కెల్చేసిందని తెలియజేశారు. అయితే మహాత్మా గాంధీ, పీవీ నరసింహారావు, ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాం, గార్లు నంది విగ్రహాలను తెలగించి రాజశేఖర్ రెడ్డి విగ్రహం తోలగించక పోవడం ముమ్మాటికి నియంతచర్యనే అని తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా! వైసిపి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలే లక్ష్యంగా వారిని అనగదొక్కడానికి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాల్యంలో 2013 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్ కూడా వారి దగ్గర ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం చేతనైతే వారికి ఇల్లు కట్టించాల్సింది పోయి పేదల పూరి గుడిసెలు, పశువుల పాకలు, గడ్డివాములు వేసుకుని ఉన్న స్థలాలను రాత్రికి రాత్రి జెసిబి లు పెట్టి కూలుస్తున్నారు. వైసిపి చోటా నాయకులను అక్కడికి రంగంలోకి దించి పేదల స్థలాల్లో ప్రభుత్వ భవనాలను నిర్మించాలని చూస్తున్నది. గత నెల అక్టోబర్ 21వ తేదీన బాధితులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని ఈనెల 11వ తేదీన విచారణ ఉన్నప్పటికీ ఈ లోగానే వాళ్లు గుడిసెలను కూల్చడమేంటని వైసీపీ వారు తమ ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారని బాధిత మహిళలు ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా పట్టించుకోకుండా ఈ వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. దీనిని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బాధితులకు జనసేన పార్టీ అండగా ఉండి వారికి న్యాయం జరిగే విధంగా పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు సరోజమ్మ శైలజ, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com