నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 307వ రోజున 9వ డివిజన్ నవాబుపేట FCI కాలనీలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి గారు ఆరు నెలలకోసారి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళను తిట్టడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు. గడపగడపకు తిరగండని ఎమ్మెల్యేలకు జగన్ క్లాసులు తీసుకుంటుంటే, అసలేమాత్రం అభివృద్ధి లేకుండా ఈ ముఖం పెట్టుకుని ఎమ్మెల్యేలు తిరుగుతారని అన్నారు. గడపగడపకు తిరగడం కాదు కదా, గడపగడప ముందు ప్రదక్షిణలు చేసినా కూడా వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత వైఫల్యం చెందిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా అప్రతిష్ఠను మూటగట్టుకున్నారని, ఇక మంత్రుల పరిస్థితి మరింత ఘోరం అని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకు అనుగుణంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాటకు అపూర్వ స్పందన లభిస్తోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com