Logo
Date of Publish : 05 August 2022, 7:50 am
Editor : Sake Naresh

ప్రజా సమస్యలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యే : నాసిర్ అహ్మద్

       చంద్రగిరి ( జనస్వరం ) : ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దామలచెరువు తలరాత మారటం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలోనే 2 వ అతిపెద్ద పంచాయతీ. సంవత్సరానికి 3 నెలలు మామిడి వ్యాపారానికి పెట్టింది పేరు. మండలానికి రెవిన్యూ జనరేట్ అవుతోంది కూడా ఎక్కువగా దామలచెరువు నుండి. ఇవ్వన్నీ పేరుకే గానీ అభివృద్ధి మాత్రం శూన్యం. దామలచెరువులో పూర్తిగా సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాలువ ఉన్న వీధి ఒక్కటి లేదు. చంద్రగిరి  శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 దఫాలుగా ఇక్కడ అధికారంలో ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా దామలచెరువు లోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మిస్తాం అని మాటిచ్చారు కానీ చేసింది లేదు. డ్రైనేజీ కాలువలు లేవు కానీ, డ్రైనేజీ పన్నులు మాత్రం వేస్తారని జనసేన నాయకులు నాసిర్ అహ్మద్ అన్నారు. ఉన్న కాలువలు అన్న శుభ్రంగా ఉన్నాయా అంటే అవి లేవు దీని వలన పసిపిల్లలు అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓట్ల సమయంలో ఉండే శ్రద్ధ ప్రజల పైన, ప్రజా సమస్యల పైన అధికారం వచ్చాక మీకు ఎంధుకుండదని ప్రశ్నించారు. ఇంటి నుండి వచ్చే వ్యర్థము ఇంటి వెనుక గుంతలు తీసుకుని నిల్వ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. దామలచెరువులోని ప్రతి వీధిలో రోడ్డులు నిర్మించాలి. డ్రైనేజీ కాలువలు వెయ్యాలి. ఉన్న కాలువలు క్రమం తప్పకుండ శుభ్రపరచాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని నాసిర్ అహ్మద్ అన్నారు. అతి తొందరలో దీని పైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com