శింగనమల ( జనస్వరం ) : బుక్కరాయసముద్రం మండలంలోని భద్రంపల్లి ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు. ఎక్కడో మూడు కీలో మీటర్ల దూరంలో పంట పొలాల్లో కి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న వైనం. ఓట్ల కోసం మత్రమే ఎమ్మెల్యే, నాయకులు వస్తారు కానీ, మా సమస్యను పట్టించుకొన్న పాపాన పోలేదని కాలనీ వాసులు అంటున్నారు. అలాగే ఎస్సీ కాలనీకి ఉన్న స్మశాన వాటికను కబ్జా చేశారని కనీసం మాకు స్మశనవాటిక కోసం స్థలం కూడ కేటాయించలేదని కాలనీ వాసులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంత సమస్య ఉన్న కూడా కనీసం ఎమ్మెల్యే అధికారులు చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణమని అన్నారు. వారి సమస్యను జనసేన పరిష్కారం చేస్తుందని వారం రోజులలోపు ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ ఈ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించకుంటే శింగనమల జనసేన పార్టీకి ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయం కి వెళ్లి కలెక్టర్ గారికి ఎస్సీ కాలని సమస్యలు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి, విజయలక్ష్మి, పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సంతోష్ యాదవ్, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి, వీర మహిళలు సరిత, అనసూయ, నియోజవర్గ నాయకులు అరటి తాహిర్, అంచల సద్దాం ఖాన్, తదితరులు పాల్గొన్నారు.