Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోండి : తాడేపల్లిగూడెం జనసేనపార్టీ ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

     తాడేపల్లిగూడెం, (జనస్వరం) : పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న నలుగురు కాపు మంత్రులపై బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు కాపు మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అది మా సంస్కారం అని అన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఏడవడం దేనికి సంకేతం అని అన్నారు. సైనిక నిధికి విరాళమిచ్చినందుకా, రైతులకు రైతు భరోసా పేరుతో ఒక రైతుకి తన సొంత ఖర్చుతో లక్ష రూపాయలు ఇచ్చినందుకా, మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో భరోసాగా ఉన్నందుకా. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్న నా కొడుకు ఎవడైనా సరే నిరూపించాలని సవాల్ విసిరారు. సినిమాలు చేస్తూ తనకు వచ్చిన దానిలోకొంత ప్రజలకు సహాయం చేయడం తప్పా! పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అనడం నీ అవివేకానికి నిదర్శనమన్నారు. తాడేపల్లిగూడెంలో కాపు కళ్యాణ మండపానికి రూపాయి చందా ఇవ్వని నువ్వు కాపుల గురించి మాట్లాడతావా. ప్యాకేజీ ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్న నువ్వు ప్యాకేజీల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కాపులపై కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నువ్వు, కాపు విలేకరులపై కేసులు పెట్టిన నువ్వు, కాపు కులస్తుడు అయిన ఒక బిల్డర్ ను వేధించి కోటి రూపాయలు తీసుకున్న నువ్వు కాపుల గురించి మాట్లాడతావని అన్నారు. నోటి పారుదల మంత్రి అంబటి రాంబాబు కూడా విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గంట అరగంట అని చెప్పి రాసలీలలు కోసం మాట్లాడే నువ్వు విమర్శలు చేయడం దౌర్భాగ్యం అని అన్నారు. పోలవరంపై పులిచింతల కడతాను అన్న నీటిపారుదల శాఖ మంత్రి నువ్వు నీ శాఖపై అవగాహన పెంచుకోవాలి. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రికార్డింగ్ డాన్సులు చేస్తూ చిందులేసే రికార్డింగ్ మంత్రి నువ్వు అని ఎద్దేవాచేశారు. పవన్ కళ్యాణ్ ఫోటో కోసం లైన్లో నుంచున్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తావా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేని నువ్వుఒళ్ళు దగ్గర పెట్టుకో అని హెచ్చరించారు. మరో మంత్రి దాడిశెట్టి రాజా గోవా, శ్రీలంకలో పేకాటలు ఆడే నువ్వు కూడా విమర్శలు చేయడం దేనికి సంకేతం అని అన్నారు. జేబులో నుంచి రూపాయి సాయం చేయని మీరు మంత్రి పదవి తీసుకున్నది ప్రజలకు సేవ చేయాడానికా, పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి అన్నది మీరే తేల్చుకోవాలని లేనిపక్షంలో ప్రతిఘటన తప్పదని బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way