
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జనసేన నాయకులు ఆల్లూరి రవీంద్ర నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా వైసీపీలో ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి చేరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులు సూచనలతో పార్టీలో వారికి గౌరవ స్థానాన్ని కల్పిస్తామని, ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ బలోపేతానికి తోడ్పడాలని వారు సూచించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఉద్యోగస్తుల సరైన వేతనాలుకల్పించటం దగ్గర నుంచి కార్యకర్తలకు గౌరవ స్థానం ఇవ్వటం వరకు పనిచేసే వారిని పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, సుధీర్ బద్దిపూడి, ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అల్లూరి రవీంద్ర, నాయకులు సురేందర్ రెడ్డి, కిరణ్ కుమార్, తిరుపతయ్య, సురేష్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.