Logo
Date of Publish : 30 July 2021, 6:17 am
Editor : Sake Naresh

దళితులపై దాడి చేసిన వైసీపీ నాయకులు : ఖండించిన రాప్తాడు జనసేన ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్

         రాప్తాడు ,  (జనస్వరం)  :   రాప్తాడు నియోజకవర్గంలోని కనగానిపల్లి మండలంలో ముక్తాపురం గ్రామంలో దళితులపై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్ గారు ఆ గ్రామాన్ని సందర్శించారు. దళితులకు అండగా నిలబడుతూ వారికి ధైర్యం నింపారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ యస్.సి, యస్.టి, బిసిలతోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు వారినే చిన్న చూపు చూడటం దౌర్భాగ్యం అన్నారు. మాహనీయుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ వైసీపీ నాయకులు తుంగలో తొక్కేశారు. ఇలాగే అణగారిన వర్గాలను తక్కువ చేసి చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా జనసేన పార్టీ ఉంటుందని, వారికి నేను నిత్యం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com