సర్వేపల్లి ( జనస్వరం ) : ప్రైవేట్ లేఅవుట్ నిర్వాహకుల కారణంగా ఆక్రమణకు గురైన తోటపల్లి గూడూరు మండలం నరకూరు పంచాయతీ పరిధిలోని 55 సెంట్లు ప్రభుత్వ పంచాయితీ స్థలాన్ని బాధితులతో కలిసి బుధవారం పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన నాయుడు మాట్లాడుతూ ప్రైవేట్ లేఅవుట్లో తెలీక ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన బాధితులకు వెంటనే అధికారులే న్యాయం చేయాలన్నారు. నరుకూరు పంచాయతీకి సంబంధించిన 55 సెంట్ల ప్రభుత్వ భూమిని గతంలో వేసిన లేఅఔట్ వాళ్లు కావచ్చు, 2012లో లేఅఔట్ వేసిన రాయల్ సిటీ నిర్వాహకులు కూడా కొంత భాగం ఆ స్థలాన్ని ఆక్రమించుకుని పంచాయతీ అధికారులను మభ్యపెట్టి రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చేసి అది తెలియని బాధితులు ఆ లేఅవుట్లో తెలియక ప్లాట్లు కొనుగోలు చేసి ఆర్థికంగా మానసికంగా నష్టపోయారు. ఈ విషయంలో జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుంది. పంచాయతీకి సంబంధించిన 55 సెంట్లు కూడా పంచాయితీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. 55 సెంట్ల నరుకూరు పంచాయతీ స్థలానికి ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ వాళ్ళు ఎలా అనుమతులు ఇస్తారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి. లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారా. కోట్ల రూపాయలు విలువచేసే పంచాయతీ స్థలానికి అనుమతులు ఎలా ఇస్తారు. దీని వెనుక ఉన్న పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకునే అంతవరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటలు చేస్తాం. ప్లాట్లు కొని మోసపోయిన బాధితులకు లేఅవుట్ నిర్వాహకులు డబ్బులు చెల్లించాలి. బాధితులు కోరుకున్న విధంగా వారికీ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. భూ సర్వే పేరుతో జగనన్న సర్వే చేసిన ఆ సర్వేలో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో మీకు కనిపించలేదా. ఈ విధంగా అన్నిక్రాంతం అయిపోతా ఉంటే రేపు గ్రామాలలో అభివృద్ధి కోసం భూములు లేకుండా పోతాయి. పంచాయతీ భూములు లేకుండా సర్వం స్వాహా చేస్తా ఉంటే పంచాయతీలకు నిధులు ఎక్కడినుంచి రావాలి. అదే నరుకురు పంచాయతీ పాలకులు ఆక్రమణకు గురైన పంచాయతీ స్థలంలో కాంప్లెక్స్ కట్టి బడుగులకు ఇస్తే పంచాయతీకి చాలా ఆదాయం వస్తుంది. మీ స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పి రేపు 2024 ప్రజా ప్రభుత్వంలో పంచాయతీ భూములను కాపాడడంతోపాటు బడుగు బలహీన వర్గాలని కాపాడటమే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి దిశగా జనసేన, తెలుగుదేశం కలిసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువస్తాం. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణి భవాని, స్థానికులుతోటపల్లి గూడూరు మండల జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడమల రవికుమార్, మండల ఉపాధ్యక్షుడు కాల్తిరెడ్డి శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షుడు మద్దినేటి శరత్ బాబు, మండల కమిటీ సభ్యులు నారాయణ, శ్రావణ్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com