Logo
Date of Publish : 01 November 2022, 3:47 pm
Editor : Sake Naresh

కాపు జాతిలో పుట్టి ఊడిగం చేయటం ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోండి : కళ్యాణ్ ముత్యాల

          ప్రకాశం ( జనస్వరం ) : వైస్సార్సీపీ కాపు నాయకులు జగన్ పాదయాత్ర సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా వత్తిడి తేవాలని జనసేన జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాపు జాతి అభివృద్ధి మరచి జగన్ వద్ద బానిసలుగా మారి జనసెన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయటమే లక్ష్యంగా పనిచేయటం వైసీపీ కాపు నేతలు సిగ్గు పడాల్సిన విషయమని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కాపులకు నాయ్యం చేస్తాను అని చెప్పి దగా చేసింది వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. దేశంలో ఆర్ధికంగా వెనుబడిన అగ్రకులాలకు కేంద్ర ఇచ్చిన 10శాతం రిజర్వేషన్ లో ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వం లో శాసనసభలో తీర్మానం చేస్తే ఆవిషయాన్ని తుంగలో తొక్కింది మీ నాయకుడే కదా అన్నారు. అలానే మీ నాయకుడు అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి రూ.2వేల కోట్లు ఇస్తాను అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడి 3ఏళ్ళు గడుస్తుంది మీరు కాపు కార్పొరేషన్ కి ఎంత విడుదల చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ లకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ చేర్చే ప్రయత్నం చేస్తా అన్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలిపి మీ నాయకుడిని అడిగి కాపులకు న్యాయం చేయవలసినదిగా కోరుకుంటున్నామన్నారు. ఆలానే విదేశీ విద్యాదీవెన రాక ఎంత మంది కాపు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో వైసీపీ కాపు నాయకులకు తెలుసా అని ప్రశ్నించారు. ముందు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మీ నాయకుడికి చెప్పండి, అంతే కానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని వాగుతూ ఉంటే రానున్న రోజుల్లో కాపులు అందరూ కలిసి మీకు రాజకీయ చరమ గీతం పాడుతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే బానిసత్వం వదిలి కాపుల అభివృద్ధికి పాటుపడండి అని అన్నారు. ఇప్పటికైనా మీ నాయకుడి మీద ఒత్తిడి తెచ్చి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అలా కాకుండా కాపు జాతికి అన్యాయం చేస్తే, రానున్న రోజుల్లో ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదురుకోవాలిసి వస్తుంది హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com