Logo
Date of Publish : 14 October 2022, 4:14 pm
Editor : Sake Naresh

వరద బాధితులకు సహాయం అందిస్తున్న జనసేన నాయకులపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు మానుకోవాలి

      పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల జనసేనపార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం పట్టణంలో వరదలు ముంచితే చాలా ప్రాంతాలు నీటిమయం అవడం జరిగింది. ఈ కారణంగా గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులు, పండ్లు జనసేనపార్టీ తరపున మా జిల్లా అధ్యక్షులు TC వరుణ్, రాష్ట్ర కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జిల్లా నాయకులు అందరూ ప్రజలకు అందజేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు ప్రజలకి ఈ ఇబ్బంది పరిస్థితులలో ఎటువంటి సాయం చేయకపోగా, ప్రజలకు అండగా నిలబడుతున్న మా జనసేన పార్టీ నాయకులకు ప్రజలలో మంచి పేరు రాకూడదని అదే పనిగా ప్రజలకు సాయం అందకుండా అడ్డుపడడం అమానుషం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన మీరు అండగా ఉండవలసింది పోయి వారికి అందే సాయాన్ని కూడా అందకుండా చేయడం దుర్మార్గం. మీకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని మేము జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాము అని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, D.నరేంద్ర భూపతి, పూల రెడ్డప్ప గూడా మధు, ముత్తా నరేంద్ర, సమ్మిటి నవీన్, సాకే తేజ ప్రదీప్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com