Logo
Date of Publish : 27 April 2021, 3:56 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులు పంథాలు పక్కన పెట్టి ప్రజల కోసం పరిపాలన అందించండి : జనసేన నాయకులు ఇటికోటి క్రాంతి కుమార్

             అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి లో MRO ఆఫీస్ కోసం కొత్త భవనాన్ని నిర్మించి సంవత్సరాలు గడిచినా కూడా కొత్త భవనాన్ని వాడకుండా శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్నే వాడుతున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ భవనాన్ని నిర్మించారు. కాబట్టి ఇప్పుడు వైయస్సార్సీపి ప్రభుత్వం లో ఆ భవనాన్ని ప్రారంభిస్తే తెలుగుదేశం వాళ్లకు పేరు వస్తుందేమో అనే ఉద్దేశంతో కొత్త భవనాన్ని ప్రారంభించలేదని స్థానిక జనసేన నాయకులు ఇటికోటి క్రాంతి కుమార్ గారు ధ్వజమెత్తారు.  ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా ప్రజల సొమ్ముతో ఖర్చు చేసిన పనులను అభాసుపాలు చేస్తున్నారు. మొదట్లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చడం తన అసమర్థపాలన తెలుస్తోంది అన్నారు. ప్రజాధనంతో కట్టిన ఆ ప్రజావేదిక ఇప్పుడు ఉండి ఉంటే కరోనా ఆసుపత్రి కోసం ఉపయోగించికునేవాళ్లు. ఇలా ఎక్కడా చూసిన రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com