Logo
Date of Publish : 21 April 2022, 3:56 pm
Editor : Sake Naresh

పేదల భూమిని కబ్జా చేస్తున్న వైసీపీ నాయకులు : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

- స్వామీ మీ అధికారం కుష్ఠు వ్యాధి గ్రస్తుల మీదనా?

- ఉప ముఖ్యమంత్రి రోగులను కూడా వదలరని నా కలలో కూడా ఊహించలేదు?

- ఒకటిన్నర సెంటు స్థలాన్ని కూడా వదలరా మీ నాయకుల కోసం 

- ఇందుకేనా మీరు ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడేది?

- ఛీ ఛీ అని ఛీత్కరించుకుంటున్న ప్రజలు, తగిన బుద్ది చెబుతాం 

- జిడి నెల్లూరు జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న

      వెదురుకుప్పం, (జనస్వరం) : వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం గ్రామపంచాయతీ, కొమరగుంట గ్రామ లెక్క దాఖలాలో నివాసముంటున్న మంగమ్మ శివయ్యలకు చెందిన ఒకటిన్నర సెంటు స్థలాన్ని స్థానిక వైసిపి నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విధానాన్ని తప్పు పడుతున్నానని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ Dr యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వత్తాసు పలుకుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని కుష్టు వ్యాధిగ్రస్తులును కూడా వదలరా? మీకున్న విశేషాధికారాలను వ్యాధిగ్రస్తుల మీద ప్రయోగిస్తారా? ఇదేనా మీరు అంబేద్కర్ కి ఇచ్చే ఘనమైన నివాళి? ఇదేనా మీరు చూపించే నిరుపేదల మీద ప్రేమ? ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రోగులను కూడా వదలరని నా కలలో కూడా ఊహించలేదు. ఒకటిన్నర సెంటు భూమి కూడా వదలరా మీ నాయకుల కోసం? ఇందుకేనా మీరు ముఖ్యమంత్రి కాళ్ళమీద పడేది, ఛీ ఛీ అని ఛీత్కరించుకుంటున్నారు ప్రజలు అని ఎద్దేవా చేశారు. మంగమ్మ శివయ్యలకు న్యాయం చేయకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం అని హెచ్చరించారు. అధికారులు మీ విధులకు భంగం కలగకుండా, మీ బాధ్యతలను మర్చిపోకుండా నిర్వర్తించి వారికి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. వారిని బెదిరించే చోటా నాయకులకు ఒకటే మాట, నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇబ్బంది పెట్టకండి లేదంటే న్యాయ పోరాటం చేస్తా, జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి అండగా నిలబడతా, ఆమరణ దీక్ష చేస్తా, వారిని ఇబ్బందులకు గురి చేస్తే మీ ఇంటిని కూడా ముట్టడిస్తా, తగిన బుద్ధి చెబుతా, ఖబడ్దార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, బాధితులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com