Logo
Date of Publish : 22 April 2023, 3:51 pm
Editor : Sake Naresh

గ్రావెల్ అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుల ఆరాచకం

    నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు నియోజకవర్గం కొడవలూరు గ్రామం దత్తం లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్థానికులు నిన్న రాత్రి అడ్డుకున్నారు వైసిపి నాయకులు నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ స్థానిక గిరిజనులపై దాడి కి యత్నించారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్థానిక పోలీసులు ఇద్దరినీ సమన్వయపరిచారు. ఈ రోజున కొడవలూరు పోలీస్ స్టేషన్లో గ్రామస్తులందరూ కలిసి గ్రావెల్ అక్రమ రవాణా పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మొన్న మీరు వచ్చి జనసేన పార్టీ తరఫున గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నించటం చూసి ధైర్యంగా నిన్న రాత్రి గ్రావెల్ రవాణాను నిలిపాము. ఆడోళ్ళతో కూడా పచ్చి బూతులు మాట్లాడుతూ యానాదులు మీకెందుకురా ఈ గొడవలు అని తిట్టిపోశారు. మేము చల్లా యానాదులమే మమ్మల్ని చంపి మా శవాల మీద ఈ గ్రావాల్ తీసుకొని పొండి అని మేము మొండిగా నిలబడ్డాము. ప్రాణం పోయినా ఇక్కడి నుంచి లారీ పోనివ్వము.. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాము వైసిపి నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. మా ఇల్లు ఖాళీ చేపిస్తామని బెదిరిస్తున్నారు న్యాయపరంగా పార్టీ తరఫున మీరు అండగా నిలబడాలి అని జనసేన నాయకులు గునుకుల కిషోర్,సుధీర్ బద్దెపూడిని కోరారు. జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని న్యాయపరంగా గిరిజనులకు అండగా ఉండి జరగతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని జనసేన నాయకులు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com