• గజ్జెహళ్లిలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ
ఆలూరు, (జనస్వరం) : వైసీపీ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని జనసేనపార్టీ ఆలూరు ఇంఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీల నిధులు మింగారని, ఒక్క పంచాయితీలో సిమెంటు బస్తా, ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే వైసీపీ నాయకులు నమ్మించి నట్టేట ముంచారని గ్రామాల్లో పెద్దలు వాపోతున్నారని తెలిపారు. ఆలూరు నియోజకవర్గం, హోళగుంద మండల పరిధిలోని గజ్జెహళ్ళి గ్రామంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు మనసులో జనసేనపార్టీని ఆవిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోళగుంద జనసేన నాయకులు అశోక్, వీరేష్, జలాల్, గంగాధర, హరున్ భాష, ఉరుకుందు, బ్రహ్మయ్య గ్రామానికి చెందిన జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com