ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షులు రాహుల్ సాగర్, అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్, మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య రెండు వందల రోజు ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడితే వైసిపి పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజా సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడాల్సింది పోయి చిరంజీవి గారిపైనా మెగా ఫ్యామిలీ పై మాట్లాడడం సరి కాదని అన్నారు. వైసీపీ నాయకులు వాళ్ల వ్యవహార శైలిని మార్చుకొని ప్రజా సమస్యల పరిష్కారంపైనా మరి ముఖ్యంగా ఆంధ్రరాష్టానికి ప్రత్యేక హోదా పోలవరం లాంటి అంశాలపై దిష్టి సారించాలని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com