విజయవాడ ( జనస్వరం ) : 48వ డివిజన్ ఆంజనేయ వాగు సెంటర్ పై భాగంలో అఖిల్ పై జరిగిన దాడి బీసీలపై వైసిపి నాయకులు చేసిన దాడిగానే పరిగణించాలని, పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న వైసిపి నాయకులకి ఏమాత్రం భయం లేకుండా అధికార మదంతో రెచ్చిపోయి బీసీలను ఇష్టానుసారం కొట్టి, దాడి చేసి, పదునైన ఆయుధాలతో పొడిచారని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తెలియజేశారు. బాధిత వర్గం కు చెందిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచి ఆ తర్వాత విడుదల చేయడం ఏమిటని, అరెస్టు చేయాల్సింది దాడి చేసిన వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులను అని, తక్షణమే ఈ ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ గారు స్పందించాలని బీసీలకు అండగా నిలబడాలని అధికార వైయస్సార్సీపి పార్టీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ దారిలో పాల్గొన్న అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా పోలీస్ శాఖ వ్యవహరించాలని, బాధితులకు అండగా నిలవాలని, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడతామని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తెలియజేశారు.