Logo
Date of Publish : 26 September 2021, 2:30 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు : మాదాసు నరసింహ

         కడప ( జనస్వరం ) :  సినిమా పరిశ్రమపై‌ వైసీపీ దోపిడీని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ మీడియాను, సినిమా పరిశ్రమ బాధలు చెబుతూ వైసీపీ నాయకుల మీద దండెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ ఓ పత్రికా ప్రకటనా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ మంత్రులు పళ్లు తోమకుండానే నోళ్లేసుకుని పవన్ పై పడ్డారు. పవన్ పై సిబిఐ కేసులున్నాయా? ప్రజలను దోచుకున్నారా? నోరు అదుపులో పెట్టుకుని వైసిపి నాయకులు మాట్లాడాలని హితువు పలికారు.  జగనన్న వదిలిని బాణం అన్న సొంత చెల్లి షర్మిలను మోసం చేశారు. తల్లి, చెల్లి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయేలా‌ చేసింది ఎవరు? జగన్ మోహన్ రెడ్డి గారిని మోసాన్ని ఈ ఎమ్మేల్యేలు ఎందుకు ప్రశ్నించరు? సొంత బాబాయి హత్య జరిగితే దోషులను పట్టుకోలేక పోయారు.  వేలాది మంది కష్టంతో సినిమా తీస్తే... మీరు టిక్కెట్లు అమ్ముకుంటారా? ఇప్పుడు మీ కార్యకర్తలతో బ్లాక్ లో టిక్కెట్లు అమ్మిస్తారా? విజయవాడలో ఓ సన్నాసి మంత్రి నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు. మూడు కొబ్బరి చిప్పలు, ఆరు చెప్పులు, బందరురోడ్ లో భూం భూం, వన్ టౌన్ వెస్ట్ లో వేస్ట్ ఫెలో వంటి సినిమాలు నీకు సూటవుతాయి... దేవాదాయ శాఖనే భ్రష్టు పట్టించిన నువ్వా పవన్ ను విమర్శించేది అంటూ ఫైర్ అయ్యారు. 2014 ఎన్నికలలో ఇదే పవన్ ను ప్లీజ్ సర్ అని బతిమలాడుకున్నది మరచిపోయారా ??  మెగా కుటుంబం ఫొటోలు పెట్టి భిక్ష అడిగిన నువ్వా పవన్ ను తిట్టేది? ఎపిలో నీకన్న సన్నాసి, అసమర్థ మంత్రి ఎవరైనా ఉన్నారా అవసరం ఉందంటే‌.. వంగి వంగి దండాలు పెడతారు. మీకు ప్రకాష్ రాజ్ ను మించిన మహా నటుడు అనే బిరుదు ఇవ్వొచ్చు.  ప్రజలకు మంచి చేయమని గెలిపిస్తే... దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకొక బెట్టింగ్ మంత్రి  మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాయిని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు ఈయనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com