నేడు దేశవ్యాప్తంగా ప్రజలు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య గారి ఆయుర్వేద మందు పైన ఆశలు పెట్టుకుని ఉంటే ఆ సంబంధిత సంస్థల చేత త్వరితగతిన అనుమతులు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని పంపిణీ జరిపించాలి లేదా దీన్ని ఓ నాటు ముందుగా అయినా పరిగణించి పంపిణీ బాధ్యత ఆనందయ్య గారికే వదిలేయాలి. ఓ ప్రక్క రాష్ట్ర ఆయుష్ సంస్థ ఈ మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీ కాకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియట్లేదు. ఇదిలా ఉండగా ప్రజలు అత్యంత ఆందోళనకరంగా ఉన్న ఈ సమయంలో పేదలకు అందాల్సిన ఆ వైద్యాన్ని అందనివ్వకుండా అధికార వైసీపీ లోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనందయ్య గారి మందుని నెల్లూరు సిటీ లోని ఆర్.ఆర్ క్యాటరింగ్ లో తయారు చేపించుకుని బకెట్లకు బకెట్లు తీసుకుపోతున్న వైనం దారుణం. ఒక మహోన్నత ఆశయంతో పేదలందరికీ ఉచితంగా ఆనందయ్య గారు ఇస్తున్న మందుని ఇలా తయారు చేయిస్తూ బ్లాక్ మార్కెట్ లో కాసులకు కక్కుర్తి పడి అమ్ముకుంటున్నారు. ఈ దుర్మార్గ చర్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అని నెల్లూరు సిటీ జనసేన ఇంచార్జ్, జనసేన నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు అన్నారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com