
అవనిగడ్డ ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండల పరిధిలోని పుచ్చగడ గ్రామానికి చెందిన దళిత జన సైనికుడు బొంతు గణేష్పై రాత్రి దాడి చేసిన వైసిపి పార్టీ నాయకులు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలకు కష్టపడుతూ జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడనే ఉద్దేశంతో తన మీద కక్ష్య గట్టిన స్థానిక వైసీపీ నాయకులు. చిన్న గొడవను పెద్దది చేసి తల పగల కొట్టి 12 కుట్లు పడడానికి కారణం అయిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నామని జనసేన నాయకులు కోరారు. జన సైనికులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేసి గణేష్ ని మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి, పరామర్శించిన జనసేన నాయకులు.