
ఎచ్చెర్ల, (జనస్వరం) : ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీకి చెందిన ప్రభుత్వ భూమిని YSRCP నాయకులు JCB లతో నున్నగా ఆక్రమించుకుంటే జనసేన పార్టీ తరుపున గెలిచిన ఆ పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ ప్రశ్నించినందుకు సర్పంచ్ మీద కార్యకర్తల మీద YSRCP నాయకులు దాడి చెయ్యడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జనసేన పార్టీ నాయకులు గేదెల చైతన్య, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు డా, విశ్వక్షేణ్, అర్జున్ భూపతి, రాజాం నాయకులు ఎన్ని రాజు ఆ మండల పోలీసు స్టేషన్ కి వెళ్లి ఎస్ ఐ తో మాట్లాడి వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ పని చేస్తున్న JCB ని సిజ్ చేయ్యాలి అంటూ ఎస్ఐ కి ఆ పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ చెప్పడం జరిగింది. SI 1-07-2022 ఉదయం 10 గంటలకు JCB ని స్టేషన్ కి తీసుకొస్తాం అని మాట ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఉదయం 10 గంటల సమయానికి JCB స్టేషన్ కి తీసుకురాకపోతే స్టేషన్ దగ్గర ధర్నా చేస్తాము అని గట్టిగా SI కి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ జనసేనపార్టీ MPTC అభ్యర్థి బాలి అప్పలనాయుడు, జి.సిగడాం యువ నాయకులు తాలబత్తుల పైడిరాజు, ఉదయ్, గురుప్రసాద్, రామకృష్ణ, కాకర్ల బాబాజీ అలాగే ఆ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.