Logo
Date of Publish : 26 September 2023, 11:15 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులకు దోచేందుకు కాదేది అనర్హం

     నెల్లూరు ( జనస్వరం ) : నది పక్కన పోరంబోకు స్థలంలో మట్టి యదేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 ట్రాక్టర్లు తవ్వుకుంటున్నారంటూ జనసేన పార్టీ జిల్లా గునుకుల కిషోర్ నిరసన గళం వినిపించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి మండల నాయకులు ఎవరికి చెప్తారో చెప్పుకోండి లైన్ క్లియర్ చేసుకున్నాను. ఎవరికి చేరాల్సినవి వారికి చేరుతున్నాయి నన్ను ఆపేది ఎవడో చూసుకుంటాను అంటూ వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా తవ్వి ఉదయం యంత్రాలు,ట్రాక్టర్లు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోయినసారి వచ్చిన వరదలకు చుట్ట పక్కల గ్రామాలు మొత్తం మునిగిపోయింది. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న గారు ఇక నేను పోటీ చేయట్లేదు కదా నాకెందుకులే అని ఇంట్లో కూర్చున్నట్లు ఉన్నారు.  ఈ ఆరు నెలలు కూడా మీరే ఎమ్మెల్యే నీ ఈ దోపిడీని ఆపాల్సిన అవసరం ఉంది. వీరికి సమాజం పట్ల బాధ్యత లేదు,అధికారులు అంటే భయం లేదు,చట్టాలంటే గౌరవం లేదు,ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఈ వైసీపీ నాయకులకి రానున్న ఆరు నెలల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. సహజ సిద్ధంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఏర్పడిన వనరులను దోచుకు తింటున్న వైసిపి నాయకులను ఇంటికి పంపించాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, శీను, వర్షన్, కార్తీక్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com