Logo
Date of Publish : 09 September 2022, 6:27 am
Editor : Sake Naresh

ఆడబిడ్డల మానప్రాణాలకు లెక్క కడుతున్న వైసీపీ నాయకులు

     నెల్లూరు, (జనస్వరం) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ సూచనలతో పార్టీ కార్యాలయంలో జిల్లా, సిటీ కమిటీ వీర మహిళలతో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లాలో వరుసగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని చెప్పకనే తెలుస్తుందని తెలిపారు. మొన్న వెంకటాచలం మండలంలో వైసీపీ కార్యకర్త సొంత బిడ్డలా చూసుకోవాల్సిన మేనకోడలు లొంగలేదని యాసిడ్ పోసి పీక కోసిన సంఘటన మరువకముందే వెంకటగిరిలో పని కోసం వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతన్ని కేసు నుంచి తప్పించేందుకు వైసిపి ప్రముఖ నాయకుడు 15 లక్షలు లెక్క కట్టడం అమానుషమని తెలిపారు.విడ్డూరం ఏంటంటే ఇంకా కేసు నమోదు కాకపోవడం దారుణం అని మండిపడ్డారు. బాలికను వారి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేసి కేసు కట్టించుకనే కొంత మొత్తం ముట్ట చెప్పినట్లు సమాచారం ఉందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించి కేసు కట్టి విచారించి దోషులను, దోషులకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులకు న్యాయం చేయాలని జనసేనపార్టీ తరుపున కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కృష్ణా-పెన్నా జిల్లా మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర కార్యదర్శులు మాధురి, ఉమాదేవి, రిహనా, 22 వ డివిజన్ మహిళా నాయకురాలు ఉమా, వెంకటగిరి నియోజకవర్గపు నాయకురాలు కస్తూరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com