Search
Close this search box.
Search
Close this search box.

ప్రభుత్వ సంస్థలకు పేర్లు మారుస్తూ వైసీపీ చెడ్డ సంస్కృతికి నాంది పలుకుతోంది : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 129వ రోజున 50వ డివిజన్ సంతపేట ప్రాంతంలోని సుందరగిరివారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం కోసం తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలకు పైగా ఏర్పాటైన సంస్థలకు నాటి పరిస్థితుల దృష్ట్యా పేర్లు పెట్టుంటారని, ఇప్పుడు వైసీపీ ఆ సంస్థలకు రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లు మార్చడం చెడ్డ సంస్కృతికి నాంది పలికినట్లు అవుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రయత్నంలో రాజకీయ ఉద్దేశాలు తప్పించి ఎటువంటి ప్రయోజనాలు లేవని అన్నారు. వైద్య రంగానికి ఎనలేని సేవలు చేసిన వారి పెట్టాలని ప్రభుత్వం భావిస్తే మహనీయులైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు వంటి వారి పెట్టాలని, ఇదే అంశాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వానికి హితవు పలికారని అన్నారు. పేర్లు మార్చుకునే సంస్కృతి మొదలైతే రేపటి రోజున ప్రభుత్వాలు మారినప్పుడు మరలా ఈ సంస్థలకు పేర్లు మారుస్తారని, దీని వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ఇప్పటికే జిల్లాల పేర్లు, ప్రాజెక్టుల పేర్లు, పథకాల పేర్ల విషయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు నియంత్రణ తప్పాయని అన్నారు. ఇటీవల నెల్లూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారని, అదేవిధంగా కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు ఉందని, రేపు ప్రభుత్వాలు మారినప్పుడు ఈ పేర్లను తొలగిస్తామని అంటే వైసీపీ వారు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశాలను గెలికి వైసీపీ రాష్ట్రంలో విద్వేషాలకు కారణమవుతోందని, ఇది మంచి పద్ధతి కాదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way