ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ చట్టానికి బదులు ‘వైసీపీ అట్రాసిటీ చట్టాన్ని’ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ తీరును, ఎమ్మెల్యే, మంత్రుల అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని, జనసేన నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకునే దుర్మార్గమైన,అమానుష పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు.. ఒంగోలు జిల్లా గిద్దలూరు లో గుంతల మయమైన రోడ్డుకు మరమ్మతుల కోసం ఎమ్మెల్యే ను నిలదీసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఎంతో బాధను కలిగించిందని, రాష్ట్రంలో అరాచకమైన రౌడీ పాలనకు ఈ ఘటన నిదర్శనం అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే సరా సారి జిల్లా ఎస్పీ కే బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏటీఎంల దగ్గర వాచ్ మెన్ లకు ఇచ్చే విలువ కూడా పోలీసులకు ఇవ్వట్లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే లను మంత్రులను నియంత్రించక పోతే ప్రజలే తగిన గుణపాఠం నేర్పిస్తారని ఆయన అన్నారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కాకు మురళి రెడ్డి, పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి, కార్తిక్, కుక్కా ప్రభాకర్త దితరులు పాల్గొన్నారు.