శ్రీకాకుళం, ఏప్రిల్ 07 (జనస్వరం) : అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడే వైసీపీ నేతల చూపు ఇప్పుడు వృద్ధులు, వికలాంగులపై పడిందని జనసేనపార్టీ బూర్జ మండల అధ్యక్షుడు కొత్తకోట నాగేంద్ర ద్వజమెత్తారు. వైసీపీ పార్టీ స్వార్ధ రాజకీయాలకు తెరతీసి పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని జనసేనపార్టీ నాయకులు, తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షలు కొల్ల జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. యంపీటీసి విక్రం మాట్లాడుతూ అసలే వేసవికాలం కాలం కావటంతో ఎండలు మండుతున్నాయని ఈ నేపధ్యంలో వైసీపీ నేతలకు కనికరం కూడా లేకుండా దుష్ట రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరో నేత సేపేన రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సంపద సృష్టితో మరిన్ని సంక్షేమ పథకాలు అమలచేసేందుకు కృషి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్వరరావు, గేదెల వాసు, మామిడి సత్యన్నారాయణ, తులగాపు గౌతమ్, మజ్జి దిలీప్, గురుగుబిల్లి కోమల్, కొమరాపు ప్రసాద్ తులగాపూ మౌళి, తులాగాపు తిరుపతి, రుంకు అనంత, సివ్వాల సురేశ్, తులాగాపు నరేష్, కుప్పిలి చంటి, తులాగాపు శ్రీను, కుర్మాపు జోగారావు, పైడి మల్లేశ్వర రావు, కరణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com