Logo
Date of Publish : 19 October 2023, 7:52 pm
Editor : Sake Naresh

వైసీపీ ఓ తాడు బొంగరం లేని పార్టీ : మర్రాపు సురేష్

           గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.  మర్రాపు సురేష్ గారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా సమస్యలే ఎవరిని కదిలించిన కన్నీరే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు. కోట్లు కొల్లగొట్టిన ముఖ్యమంత్రి ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఇచ్చాడా? అని అన్నారు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడం హాస్యస్పదం. ఇంకో ఐదు నెలలే, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వమే వస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అపార నష్టమని అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలు అయిందని అన్నారు. వ్యవసాయ రంగంపై వైసీపీ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం మీరే తీసుకొచ్చినట్లు బిల్డప్ ఎందుకు? ఆ సంస్థ తమ ఉత్తరాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసం కార్యాలయం ఏర్పాటు చేసింది. బొత్స టోఫెల్ టోపీ నిజమేనండీ, టోఫెల్ ఒప్పందం సీఎం కార్యాలయం పరిధిలోనే సాగింది. సంబంధిత మంత్రి బొత్సకు తెలియకుండా ఒప్పందం జరిగి ఉండొచ్చు. ఆయన 54 పేజీల ఒప్పందాన్ని చదివి వస్తే చర్చకు మేం సిద్ధమని అన్నారు. ప్రజాధనం లూటీ విషయంలో వైసీపీ రూటే సపరేటు. జనసేన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతుంది. వైసీపీ ఓ తాడు బొంగరం లేని పార్టీ అని, ఆ పార్టీకి అధ్యక్షుడెవరో తెలీదు క్రియాశీలక సభ్యులూ లేరు. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకు కార్యకర్తలు నాయకులు అందరు కలిసి పని చేయాలి అని అన్నారు. 3వ విడత పల్లె పల్లెకు జనసేన కార్యక్రమ౦పై కార్యచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డా. రవికుమార్ మిడతాన,కలిగి పండు, ఆదినారాయణ, మహేష్ శ్రీను, గంట్యాడ మండలం బాలు యాదవ్, గణేష్, హేమసుందర్, లక్ష్మణ, చరణ్, అనిల్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com