అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు మాట్లాడుతూ.. నివర్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 35000 చెల్లించాలని, లేకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాల భద్రత లేదని, రథం కాల్చివేత విగ్రహాల ధ్వంసం జరుగుతుందని, మద్యనిషేధం చేస్తామని గెలిచిన ప్రభుత్వం రెట్టింపు ధరలతో మధ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు అని తెలియజేశారు. అప్పు చేసి పప్పు కూడు తప్ప, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి అని తెలిపారు. సామాన్య మధ్య తరగతి ప్రజల నడి విరుసుతున్నారని తెలిపారు. అనకాపల్లి ఈ స్థలాలను స్థానికులు కేటాయించాలని విశాఖ ప్రాంత ప్రజలకు ఇచ్చి స్థానికులు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. రోడ్లు సరిగ్గా లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు స్పందించాలని కోరారు. కొంత మంది వైఎస్ఆర్సీపి నాయకులు సభ్య సమాజం తలదించుకునే లాగా భాషను ఉపయోగిస్తున్నారని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని విమర్శిస్తున్నారు. వారి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విశాఖపట్నంలో ఓడిపోయారని దానికి సమాధానం ఏమిటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో భవిష్యత్తు జనసేనని, పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకుల్లాగా అవినీతి సంపాదన లేదని పార్టీ నడపడానికి కొన్ని సినిమాలు నటిస్తున్నారని తెలిపారు. ఈ రోజు గ్రామ కమిటీలు ప్రకటించడం జరిగింది. త్వరలో మండల వార్డు కమిటీలు ప్రకటిస్టా౦. ఫిబ్రవరి నుండి గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలపరుస్తామని పరుచూరి భాస్కర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల నూకరాజు, రాము తాడి రామకృష్ణ, గెంజి సత్యారావు కామరాజు, మంగా ఈశ్వర్, తాకాసి సత్యందోర, దూలం గోపి, కొడుకుల శ్రీకాం,త్ అప్పికొండ గణేష్, సుద్దాల రాంజీ, తర్ర అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com