కడప ( జనస్వరం ) : మండల కేంద్రమైన సిద్ధవటం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు కే రాజేష్ మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ పదేపదే విమర్శలు చేయడం తప్ప మీరు రాష్ట్రానికి ఏమి సాధించారో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని చెప్పడం పదే పదే వైసీపీ పనిగట్టుకొని విమర్శలు చేయడం మీ పరువు మీరే తీసుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై అక్రమ కేసులు పెట్టడం కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప రాష్ట్రానికి ఏమి చేశారో మీరు చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ పై టార్గెట్ పెట్టడం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మా పార్టీ పొత్తు మా నాయకులు చూసుకుంటారని, వైసీపీ పార్టీకి మా పార్టీతో మా పొత్తులతో మీకు ఏమి సంబంధం అని అన్నారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పాలని యువత ఉద్యోగులకు పోయినప్పుడు వారి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ఎంతసేపు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏమి సాధించారు. అ ప్రతిపక్షాలపై విమర్శలు మానుకొని మీ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు రాష్ట్రానికి తెచ్చారో అవి బహిరంగంగా తెలపాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని అన్నారు. వాలంటరీ వ్యవస్థ పై నిజాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టడం ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని మండల జనసేన పార్టీ అధ్యక్షులు రాజేష్ అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com