గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం 28 లక్షల ఇళ్లు కడతామని గొప్పగా పబ్లిసిటీ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి ప్రారంభించారని అనంతపురం జిల్లా జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి గారు ధ్వజమెత్తారు. అయిపోయిన పెళ్ళికి మళ్ళీ మేళం ఉన్నట్లుగా మరలా ఈరోజు 28 లక్షల ఇళ్లు కడతామని వందల కోట్లు పబ్లిసిటీ కోసం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇటువంటి తరుణంలో ఖర్చుపెట్టడం అవసరమా ? అని సూటిగా ప్రశ్నించారు. రోజు ఇలా వందల కోట్లు ప్రకటించిన పథకాలకే మరీ మరీ వందలకోట్లు తగలేసి ఈ విధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగ చేయడం ఎంతవరకు సమంజసం. ఈ పెట్టే డబ్బు ఏదో కరోనాతో ఉన్నటువంటి ఈ తరుణంలో పబ్లిక్ హెల్త్ కోసం ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పబ్లిసిటీ పిచ్చి ఏంటో అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము అది ప్రజల సొమ్ము అని మర్చిపోకూడదని, తమ పార్టీ కాదని తెలుసుకోవాలని సూచించారు. 2016 నుంచి నేటి వరకు దాదాపుగా రాష్ట్రంలో 80 వేల గృహాలు మధ్యంతరంగా ఆగిపోయాయి. వీటన్ని౦టికి కూడా ప్రభుత్వ ధనమే కేటాయించడం జరిగింది. గతంలో ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు ఎందుకు ఆపింది. వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలన గురించి చెప్పనవసరం లేదు. ఆర్టికల్ 39, 38,45 ప్రకారం రాజ్యాంగం చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజలకు ప్రభుత్వాలు కల్పించాలి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొద్ది వరకు అభినందించినవచ్చు. కానీ, అభివృద్ధి పారిశ్రామిక విధానం పెట్టుబడుల్లో రెండేళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్ లో పాస్ అయినంత మాత్రాన పాస్ అయినట్టు కాదు మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా పాస్ కావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని అన్నారు. కేవలం ప్రభుత్వం ధోరణి చూస్తుంటే కక్ష సాధింపులు తప్ప రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టి కక్ష సాధింపు ముందుకెళ్తోంది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వీరి అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం ఈ రోజు తమ డప్పు తమే వాయించుకుంటూ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా లేదు అని మీరు చెప్పగలరా? రాష్ట్ర ప్రభుత్వమే మొత్తమంతా ఖర్చు పెడుతున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? అని ధ్వజమెత్తారు ...
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com