వివరాల్లోకి వెళితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల విరామం తరువాత నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తారీఖు విడుదల అయిన విషయం తెలిసిందే. కాకపోతే నిడదవోలు ధియేటర్ యాజమాన్యం మరియు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సినిమా 8వ తారీఖు బెనిఫిట్ షో వేస్తామని ఫ్యాన్స్ ని ఛీటింగ్ చేసి ఒక టికెట్ కు 1000/- వసూలు చేసి ఆ రోజు సినిమా ప్రదర్శించలేదు. అదేమని అడుగగా సినిమా ప్రదర్శనకు పర్మిషన్ లేదన్నారు. సరే టిక్కెట్ డబ్బులు వెనకకు ఇవ్వమంటే ఇవ్వలేదు సరికదా ఫ్యాన్స్ ని కొట్టి చంపుతామని బెదిరించటంతో వారు ఈ అన్యాయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారికి చెప్పుకుందామని ఆయన ఇంటికి వెళ్ళిన పాపానికి, తనకు ఎలక్షన్స్ సపోర్టు చేయలేదని, జనసేన కార్యకర్తలను, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కి పని చేసిన 16 మంది పై అనేకానేక సెక్షన్ లు పెట్టి వారిని ఇపుడు పోలీస్ స్టేషన్ కి రమ్మని వేధించటం సరికాదని జపసేనపార్టీ లీగల్ సెల్ సభ్యులు అనుకుల రమేష్ అన్నారు. ఇది అధికార పక్షం కక్ష పూరితంగా జనసేన పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేయడానికి పెట్టిన కేసు అని, ఇటువంటి అక్రమ కేసులకు జనసేన పార్టీ నాయకులు భయపడరని ఎంతటి న్యాయ పోరాటానికైనా మేం నిలబడతామని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు రంగా మధుసూదన్ రావు గారు మాట్లాడుతూ ఈ విధంగా అన్యాయం గా కేసులు పెట్టడం సరికాదని ఇది టీ కప్పు లో తుఫాను లాంటిదని అలాగే చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా ఉండాలని, జనసేన పార్టీ నాయకులు పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మల్లికార్జున్, జనసేన నాయకులు పిప్పర రవి, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.