Logo
Date of Publish : 17 December 2021, 4:58 am
Editor : Sake Naresh

పార్లమెంటులో రాష్ట్రం దివాళా తీస్తోందని చెప్పుకునే పరిస్థితి కల్పించిన వైసీపీ ప్రభుత్వం : చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరి కీర్తన

  చిత్తూరు, (జనస్వరం) : లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మా రాష్ట్రం దివాళా తీసిందని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ఆర్ధిక స్థితిని ఎంత దిగజార్చరో అర్థం అవుతోందని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరి కీర్తన అన్నారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల్సిన దృష్టి, అప్పులు ఎక్కడ పుడతాయి అనే దాని పైన పెట్టారు. పాలకులు ప్రజా సమస్యల పైన పోరాడకుండా వ్యక్తిగత దూషణలలోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. మీ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టి ఉంటే ఈ రోజు మనం అప్పు అడుక్కునే స్థితిలో ఉండే వాళ్ళం కాదని. ప్రభుత్వ ఆస్థులను అమ్మి ఉద్యోగులకు జీతాలను ఇద్దామని ఆలోచిస్తున్నారే తప్ప కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకురావాలని కాని యువతకు ఉపాధి కల్పించాలని కాని అస్సలు ఆలోచించడం లేదు. కేవలం ఒక వర్గాన్ని ఓటు బ్యాంకులా చేసుకోవడనికి సంక్షేమ పధకాల మీద శ్రద్ధ పెడుతున్నారే తప్ప ఆదాయ వనరుల్ని సమకూర్చాలనే అంశాల గురించి అస్సలు ఆలోచించట్లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు దాదాపుగా 6లక్షల కోట్లకు చేరిందని, అందులో 3 ఏళ్ళలో ఈ వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 3 లక్షల కోట్లు చేసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుల ఎక్కడ నుండి తీసుకురావాలా అనే దాని కన్నా ఆదాయ వనరులు ఎలా సృష్టించాలో వాటి మీద దృష్టి పెట్టాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com