కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కరప మండలం లోని యండమూరు గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పన్నెండవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. ఎక్కడ చూసిన ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన మారాలి అని వారు వాపోయారు. జగన్ అనే నరకాసుర వధ జరగాలి, అప్పుడే ఈ రాష్ట్రానికి నిజమైన దీపావళి.. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.