Logo
Date of Publish : 14 November 2022, 10:28 am
Editor : Sake Naresh

తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి కనీస వసతులను కల్పించలేని వైసీపీ ప్రభుత్వం : నలిశెట్టి శ్రీధర్

         ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణ సమీపంలోని జగనన్న కాలనీలను మరియు మున్సిపాలిటీ పరిధిలోని జాలయ్య నగరం సమీపంలోని టిట్కో గృహ సముదాయాలను సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలలో 1936 ఇళ్ళ కు గాను, కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి.టిడ్కో గృహాలు పూర్తయి మూడు సంవత్సరముల కాలం గడిచినప్పటికీ నేటి వరకు పూర్తిగా గృహాలను లబ్ధిదారులకు కేటాయించడం జరగలేదు. మిగిలిన గృహాలను కూడా లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని మరియు తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి కనీస వసతులను కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. 1936 కాలనీలకు గాను కేవలం134 మాత్రమే పూర్తయ్యాయి అంటే నిరుపేదలకు మీరు ఇస్తున్న ఇళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేసి ఇస్తారు? స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వంశీ, చంద్ర, నాగరాజు, తిరుమల, భాను, పవన్, అనిల్, మదన్, హజరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com