చిన్నారులకు విద్యను దూరం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : మత్స పుండరీకం

వైసీపీ ప్రభుత్వం

                పార్వతీపురం ( జనస్వరం ) : కొన్ని గ్రామల్లో పాఠశాలలు శతాబ్దలుగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న పాఠశాలలను ఎత్తివేయాలని చూడడం అమానుషని వీరఘట్టం జనసేన నాయకులు మత్స పుండరీకం అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్లో విలీనం చేయడం ద్వారా 3,4,5 తరగతులు, ప్రాథమికోన్నత పాఠశాల 6,7,8 విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. విద్యార్థులను బడికి దూరం చేయటం అంటే విద్యకు దూరం చేయడమే అని అన్నారు. సొంత గ్రామాల్లో పాఠశాలలను మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయడం వలన ఇటు విద్యార్థులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేదలు తమ పిల్లలను దూరప్రాంతాలకు పంపించాలంటే రవాణా ఖర్చులు అదనపు భారంగా మారనున్నాయి. అంతేకాకుండా దినసరి కూలి పని చేసుకునే తల్లిదండ్రులకు పిల్లలను స్కూలుకు తీసుకురావడం, తీసుకువెళ్లడం సమస్యగా మారుతుందని పుండరీకం అన్నారు. పాలకొండ నియోజకవర్గoలోని వివిధ గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటాని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంకి చీమ కొట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేసారు. విద్యను దూరం చేసే ఈ పాఠశాల విలీన విధానాన్ని ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలి. లేనియెడల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని మత్స పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం సభ్యులు వాన కైలాష్, మంతిని వ్యాగ్రీష్ రావు, కంటు గణేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way