ఆచంట ( జనస్వరం ) : రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై మోయలేని భారం వైసీపీ ప్రభుత్వం వేస్తుందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసాక నష్టాలు అని సాకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం వలన ప్రవేయిట్ రవాణా సంస్థలు అత్యధిక చార్జీలు వసూలు చేయడం వలన పేదలకు మరింత భారం అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలన్నీ రెట్టింపు అవడం వలన అన్ని రంగాల్లోను అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారని అన్నారు. కావున పేదలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ప్రజల్లో తిరుగుబాటు తప్పదని ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ గారు, జిల్లా జాయింట్ సెక్రెటరీ శ్రీమతి షేక్ ముంతాజ్ బేగం ఆలీ గారు , జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ గారు హెచ్చరిస్తు, ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించకుంటే జనసేనపార్టీ ఆధ్వర్యంలో ప్రజా క్షేత్రంలో నిరసన కార్యక్రమలు చేపడతామని అన్నారు.