Logo
Date of Publish : 18 December 2020, 2:04 pm
Editor : Sake Naresh

పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ అసహనంగామార్చిన వైసిపి ప్రభుత్వo : జనసేన నాయకులు

పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ అసహనంగా మార్చిన వైసిపి ప్రభుత్వo : జనసేన నాయకులు

                    ఏలూరు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చొదిమెళ్ళ పంచాయతీ లక్ష్మీపురం గ్రామ శివార్లలో 142 ఎకరాలలో షుమారు 7 వేలమంది లబ్దిధారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒక్కొక్క లబ్ధిదారునికి ఒక సెంటు స్థలం మాత్రమే ఇవ్వడం చాలా దారుణమనీ, గత ప్రభుత్వాలు 5 సెంట్లు, 3 సెంట్లు, 2సెంట్లు గా ఇవ్వడం జరిగిందనీ ఇది పేద ప్రజల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఉన్న వివక్షను తెలియజేస్తోందని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. ఈ ఇళ్లస్థలాలలో నివసించేవారు కడుపేదరికంలో ఉండి రోజువారి కూలి చేసుకునేవారు కావడం, వీరు ఊరికి దూరంగా ఉండటం వల్ల జీవనోపాధి కోసం వారు పట్టణానికి రాలేక చాలా ఇబ్బందుల పాలవుతారని, సుమారు 25 వేల మంది ప్రజలు నివసించబోయే ఈ ప్రాంతానికి విద్యా వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక వసతులను కల్పించకుండా స్థలాలను ఇవ్వడం చాలా దారుణమని , ముఖ్యంగా ఉచితంగా ఇస్తున్న ఈ ఇళ్ల స్థలాలు పల్లపు భూముల్లో ఉండటం, వాటికి కరెంటు, రోడ్లు, డ్రైన్లు, మొదలగు సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం , అక్కడ నిర్మించే ఇళ్లకు బేస్మెంట్ లు ఎత్తుగా లేకపోవడంతో చిన్న వానకి మునిగిపోయే అవకాశాలు ఉండటం , నిర్మించబడిన ఇళ్ళలో నాణ్యత లోపించడంతో అలాంటి స్థలాలు నివాసయోగ్యం కాక నిరుపయోగంగా మారిపోతున్నాయని రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు.
                         ఇక్కడ ఈ ప్రభుత్వం తానేదో ఘనత సాధించానని చెప్పుకోవడానికి ఒకేసారి 25 లక్షల ఇళ్ల స్థలాలు పంచాలని అనుకుంటుంది కానీ , తాను ఇచ్చే సెంటు స్థలం ఎందుకూ పనికిరాని స్థలంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. కనీసం ఒక కుటుంబం నివసించడానికి రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించవలసి ఉంటుందని, నిర్మించే ఇండ్లకు కనీసం మూడు అడుగుల బేస్మెంట్ ఉండాలనీ , తక్కువ ధరలో నిర్మిస్తే దానికి తగినంత నాణ్యత లోపిస్తుంది కనుక నిర్మించే ఇంటి యొక్క ఖరీదు సుమారుగా 5 లక్షలు గా ఉండాలని, నివాసయోగ్యం కి కావలసిన అన్ని ప్రమాణాలను పాటించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. గతప్రభుత్వం ఇలాగే (టేడ్కో) ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు ఇవ్వకపోవడంతో లబ్దిదారులు చాలా అవస్థలు పడుతున్నారు కనుక ముందుగానే ప్రభుత్వం ఇస్తున్న ఈ ఇండ్ల స్థలాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి , సరైన మౌళిక సదుపాయాల కల్పన జరిగిందా , లేదా అనేది తెలుసుకోవడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తన సహచర నాయకులూ నగర అధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, బొత్సా మధు, ఒబిలిశెట్టి శ్రావణ్, సరిది రాజేష్, గుబ్బల నాగేశ్వరరావు, అంజనేయలు, నాగభూషణం , కుమార్, ఆర్కే , ధర్మేంద్ర, జనసేన రవి, గంగరాజు, చిరంజీవి, దుర్గారావు తదితర కార్యకర్తలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com