ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఈ సెకండ్ వేవ్ ఇంకా తీవ్రంగా దెబ్బ తీస్తోందని రాజాం పేట జనసేనపార్టీ రామశ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ దీనికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఒకరి మీద ఒకరు వేసుకుంటూ సామాన్య ప్రజలను దిక్కులేని చావులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఫ్లాంట్ లు ఏర్పాటు చేయకుండా ఆ నిధులు పప్పూ బెల్లాలకు తరిలించిందని పిఎం కేర్ అధికారులు తెలుపుతున్నారు. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ 25% వృధా చేశారు. ప్రజలకు ఉండే అపోహలు తొలగించడంలో పూర్తిగా విఫలం చెందడంతో చాలామంది వాక్సిన్ వేయించుకోలేదు ఇప్పుడు పోతే లేవు. తగినన్ని హాస్పిటల్స్ లేవు ఉన్నా బెడ్లు లేవు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు లేకుండా ప్రజలను ప్రభుత్వమే చంపేస్తుంది. మొండి పట్టుదలతో స్కూల్స్ పెట్టి ఉపాధ్యాయులు, పిల్లల మరణానికి కారణమయ్యారు. సినిమా టికెట్ల విషయంలో స్పందించిన దాంట్లో 1% కూడా ప్రభుత్వం స్పందించిన వేల ప్రాణాలు దక్కేవి. ఒక్క పక్క కరోనా తీవ్రంగా ఉంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచి దళారీలను పెంచి పోషిస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్ బెడ్ కోసం ఎమ్మెల్యే, మంత్రుల రెకమండేషన్ తో ఇస్తున్నారు.ప్రైవేట్ హాస్పిటల్ కు పోతే ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి,పేదవారికి వైద్యం అందక చనిపోతున్నారు. కరోనా పేషంట్ లకు వాడే రెమిడెవిసర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో లక్షల రూపాయలకు బహిరంగంగా విక్రయిస్తున్న అధికారులు,ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఆఖరికి చనిపోయిన వ్యక్తి శవాన్ని తగలపెట్టడానికి చోటు లేకుండా ఉంది. ఆఖరికి శవదహనానికి కూడా డబ్బులు వేలకు వేలు గుంజుతున్నారు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు, హాస్పిటల్స్ లేవు, మందుల కొరతతో జీవితాలు గాలిలో దీపం లాగా తయారయ్యిందన్నారు. అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోకుండా తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తునన్నారు.