Logo
Date of Publish : 20 December 2022, 3:48 pm
Editor : Sake Naresh

అడ్డగోలు పన్నులతో బహిరంగ దోపిడీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

       నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 218వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ నారా వారి సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత పథకాలకు ప్రభుత్వ నిధులన్నీ మళ్ళించి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన వైసీపీ ప్రభుత్వం సంపద సృష్టి కోసం అడ్డదారులు తొక్కుతోందని అన్నారు. ప్రజల నుండి ఇంటి పన్నును వసూలు చేస్తే ఆ ఇంటికి సంబంధించి అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని, కానీ నేడు చెత్తతో సహా ప్రతి అంశానికి పన్ను వసూలు చేస్తున్నారని అన్నారు. వాహనాలు తిరిగేందుకు రోడ్డు పన్ను వసూలు చేస్తున్నారని, రవాణా వాహనాలకు ఈ పన్నులను విపరీతంగా పెంచారని, కానీ రోడ్ల దుస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. అధికారం చేపట్టిన మూడేళ్ళలో ఏమాత్రం అభివృద్ధి అనేదే లేకుండా పరిపాలన చేసిన ప్రభుత్వం దేశంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ భాగోతం ప్రజలకు అర్థం అయిపోయిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచి ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలు సిద్ధమయ్యారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com