నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 254వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం దర్గా వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి రాజ్యాంగం అమలు కావడంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి కృషి ఎనలేనిదని అన్నారు. నేడు దేశ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం అని అన్నారు. కానీ నేడు మన రాష్ట్రంలో తమ అడ్డగోలు విధానాలతో, చీకటి జీవోలతో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గణతంత్ర దినోత్సవం జరిపే నైతికత లేదని అన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారే అని, ప్రజలందరి ఆశీస్సులతో పవనన్న ముఖ్యమంత్రి కానున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com