Logo
Date of Publish : 02 December 2022, 3:41 pm
Editor : Sake Naresh

కోవిడ్ సమయంలో మాస్కులు కుట్టిన మహిళలకు మూడేళ్లుగా బకాయిలు చెల్లించని వైసీపీ ప్రభుత్వం : దారం అనిత

       మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభించగా మాస్కులు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మాస్కులు ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మదనపల్లి మండల పరిధిలోని ఐదు మహిళా సంఘాలకు మాస్కులు కుట్టే బాధ్యతను అప్పగించింది. తమకు ఉపాధి దక్కిందన్న సంతోషంలో మహిళలంతా యుద్ధ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టి మాస్కులు కుట్టే పని చేపట్టారు ఒక్కో మాస్కు మూడు రూపాయలతో కొంటామని డిఆర్డిఏ తరఫున వీరికి అవకాశం కల్పించారు. మహిళలు సొంతంగా వస్త్రాన్ని తీసుకొచ్చి మాస్కులు కుట్టి అప్పగించారు. మదనపల్లి మండలంలో దాదాపు 3,40,000 మాస్కులకు పైగా తయారుచేసి మహిళా అప్పగించారు. వీటికి సంబంధించి బకాయిలు మాత్రం నేటికీ వారికి అందలేదు అందుకోసం అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి డివిజన్లోని అన్ని మండలాల్లో దాదాపు 80 మందికి పైగా మహిళలు పనిచేశారు గుత్తేదారులు పెట్టిన పెట్టుబడి రాకపోగా వీరి వద్ద పనిచేసిన మహిళా దర్జీలకు కూలి చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. పలువురికి అరకొర చెల్లించగా మిగిలినవారు ఘర్షణకు దిగుతున్నారు. దీంతో మహిళా సంఘాల్లో రుణాలు తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మదనపల్లె కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం వీకోటలో పలు మహిళా సంఘాల్లోని దర్జీలకు ఇంతవరకు బకాయిలు అందలేదు మదనపల్లి మండలంలోని 30 లక్షల వరకు దుకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కరోనా పని సమయంలో పనిచేసినందుకు మూడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప తమకు మిగిలింది ఏమీ లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన పెట్టుబడిని చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com