Logo
Date of Publish : 08 May 2021, 6:52 am
Editor : Sake Naresh

ఇసుక పాలసీ విధానంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

                   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా .. ఇంకా ఇసుక పాలసీ పైన ప్రభుత్వం పూర్తి అవగాహనతో లేకపోవడం దురదృష్టకరమని రైల్వేకోడూరు జనసేన పార్టీ స్థానిక నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆక్షేపించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు ట్రాక్టర్ లలో, పట్టణాలకు లారీలలో ఇసుక సరఫరా కొన్నిసార్లు ఇబ్బందికరంగా జరుగుతుందన్నారు. ప్రకృతి పరంగా సహజసిద్ధంగా లభ్యమైన ఇసుక కొన్నిసార్లు అక్రమ రవాణా జరుగుతుందని సరఫరా సరైన పద్ధతి లేని కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. దాదాపు 18 టన్నులు ట్రాలీ ఇసుక , గృహ నిర్మాణ దారునికి చేరేసరికి 13500 ఖర్చు అవుతుందని అదే ఒక ట్రాక్టర్ ఇసుక నాలుగు టన్నుల ధర 4000 పలుకుతుందని మరియు పై ఖర్చులు 200 లేదా 300 అవుతున్నదని ఇసుక వాడకందారులు వాపోతున్నారు. ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇసుక పాలసీ పై సరైన కార్యాచరణ నిర్వహించకపోవడం ప్రజలను, గృహ నిర్మాణ కార్మికులను తీవ్ర సమస్యలకు గురిచేస్తున్నది అన్నారు. లారీల లో వచ్చిన ఇసుక సరిగా లేకుంటే తిరిగి వాపస్ పంపితే ఆ డబ్బులు తిరిగి తీసుకోవడం భయంకరమైన ఇబ్బందులు గురవుతున్నాయని.. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు మొదట కేటాయించిన... ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనoలో ఇంకా ఇసుక పాలసీ ఉందని... తీసుకుపోయిన ఇసుక బాగా లేనప్పుడు వెనక్కి పంపితే... దాని గురించి వివరించేందుకు సరైన హెల్ప్లైన్ లేవని... ఉన్న సరిగా పని చేయవని ... ఒక్కోసారి డబ్బులు కట్ అయిన తర్వాత వెబ్సైట్ సరిగా పనిచేయదని ఇసుక కావలసినవారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఇసుక ధర, సరఫరా పద్ధతిని పునరుద్ధరించాలని సహజ సంపదను దోపిడీకి గురికాకుండా కాపాడాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com